హైదరాబాద్ టు వెంకటాపురం కంటైనర్ దుకాణాలు

Written by telangana jyothi

Published on:

హైదరాబాద్ టు వెంకటాపురం కంటైనర్ దుకాణాలు

– 1లక్ష 50 వేలకు డోర్ డెలివరీ. 

– ఆసక్తి చూపుతున్న చిరు వ్యాపారులు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపారాల కూడలి  ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటు చేసుకోవాలంటే  లక్షల రూ.  అడ్వా న్సులు, నెలవారి అద్దెలు భారీగా పెరిగిపోవడంతో చిరు వ్యాపారులు కంటైనర్ బడ్డీలలో వ్యాపారం చేసుకునేం దుకుఆసక్తి చూపుతున్నారు.ములుగు జిల్లా అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో కంటైనర్ దుకాణాలలో కిరాణా, కూరగాయలు, రేడిమేడ్ దుస్తులు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నా రు. ప్రధాన రహదారులు,మరియు రద్దీ తక్కువగా ఉండే, వెంకటాపురం పట్టణ శివారు కాలనీలు, కార్మిక వాడలు, తదితర ప్రాంతాల్లో కట్టైనర్ బడ్డీలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసేందుకు చిరు వ్యాపారు లు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన కొంతమంది కంటైనర్ తయారీ సంస్థలు, వారి వారి ఏజెంట్ల ద్వారా కావలసిన వారికి, సైజులు వారిగా బుకింగ్ చేసుకుని, డోర్ డెలివరీ పద్ధతిన ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చి ఆయా వ్యాపారులు సూచిం చిన ప్రాంతంలో కంటైనర్ దుకాణాన్ని కిందికి దించి అప్పగిస్తున్నారు. ఆయా సైజులను బట్టి 1.50 లక్షల నుండి 2 లక్షలకు పైగా హైదరాబాద్ కంటైనర్ వ్యాపార సంస్థలు బిల్ చేస్తున్నారు. ఈ మేరకు వెంకటాపురం పట్టణ పాత మార్కెట్ సెంటర్ లో చిరు వ్యాపారులు కంటైనర్ దుకాణాన్ని హైదరాబాద్ నుండి తెప్పించి శుక్ర వారం కిరాణా, కూరగాయల దుకాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 12 అడుగులకు పైగా వెడ ల్పు, పది అడుగుల పైగా పొడవుతో గట్టి ఐరన్ రేకులతో, ఛోరీలకు అవకాశం లేకుండా , భద్రతాపరంగా తయారు చేశారు. అలాగే కంటైనర్ సీలింగ్ పై భాగంలో రెండు ఫ్యాన్లు కూడా సంస్థలు బిగించి, బుకింగ్ చేసిన వ్యాపా రులు కు అప్పగిస్తున్నారు. కంటైనర్ ను సైజుల ప్రకారం ఆర్డర్లు బుక్ చేస్తున్నట్లు సమాచారం. కంటైనర్ షాపింగ్ బడ్డీలను మరోచోటికి సులభంగా తరలించవచ్చునని సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసిన వారికి వివరిస్తు న్నారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ కంటైనర్ బడ్డీలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now