ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పై దుండగుల దాడి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ దామెర వాయి అటవీ ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికా రులపై దుండగులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి 11:30 ప్రాంతంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లో దామర వాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని చదును చేస్తూ చెట్లను నరికి మొట్లను పెక్కిలిస్తున్న జెసిబి ని రాత్రి సమయంలో విధులు నిర్వహి స్తున్న ఎఫ్ఎస్ఓ వినోద్,మరియు బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సుమన్ టీం జేసీబీ చేస్తున్న పనులు అడ్డుకొని స్వాధీన పరచుకొని తాడ్వాయి అటవీ కార్యాలయమునకు తరలించు చుండగా సమీపంలో జెసిబి ఓనర్ గంట సూరజ్ రెడ్డి అలి యాస్ గున్న ఇద్దరితో కలిసి అటవీ అధికారులపై విచక్షణ రైతంగా ఇనప రాడ్లతో దాడి చేశారు ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు జీప్ వాహన లైట్స్ ని ద్వంసం చేసి జెసిబిని తీసుకుని వెళ్ళగా ఈ దాడిలో ఎఫ్ఎస్ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్ర గాయాలు చాలా చోట్ల విరిగినట్లు వైద్యు లు తెలిపారు. శరత్ చంద్రకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిం చారు గురువారం రాత్రి సమయంలో తాడ్వాయి అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ డాడీ కి పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించా లని ఫారెస్ట్ ఆఫీసర్లు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తు న్నట్లు ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రకటించింది.