గోదావరి ముంపుకు గురి అవుతున్న గ్రామాల ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలి.

Written by telangana jyothi

Published on:

గోదావరి ముంపుకు గురి అవుతున్న గ్రామాల ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలి.

ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి

– మండల ప్రత్యేక అధికారికి వినతి పత్రం అందించిన ఆదివాసీ నవనిర్మాణ సేన

తెలంగాణాజ్యోతి,వెంకటాపురంనూగూరు:గోదావరి వరద లకు ముంపుకు గురి అవుతున్న ఏజెన్సీ గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి వెంకటాపురం మండల ప్రత్యేక అధికారికి బుధవారం మెమోరాండం అందజేశారు. మండలం లోని ఏకన్నా గూడెం గ్రామ ఆదివాసీ మహిళలు, ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారిణి స్వర్ణలత , తాహసీల్దార్ వీరభద్రప్రసాద్, ఎంపిడి ఓ రాజేంద్రప్రసాద్, ఎంపీ ఓ హన్మంత్ లను కలసి వరద లకాలం లో ఇబ్బందులు ను విన్నవించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం లో అదికారులను కలిశారు.ప్రతియేటా వానా కాలం సమయం లో ప్రక్కనే ఉన్న గోదావరి ఉప్పొంగి తమ గ్రామాన్ని ముంచు తోందని తెలిపారు. వరద ముంపుకు తమ గ్రామం గురైన ప్రతిసారి, తమ గ్రామానికి అనుకోని ఉన్న ఫారెస్ట్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో ఏళ్లుగా తల దాసుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు . తాముంటున్న స్థలాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాల ని తహసీల్దార్ ను కోరడం జరిగింది. వానాకాలం వచ్చిన ప్పుడల్లా తమ గ్రామం చుట్టూ గోదావరి నీళ్లు వచ్చి ఇల్లు ముంపుకు గురై ప్రమాద కరమైన పాములు, తేల్లు ఇళ్లలోకి వస్తున్నాయని తమ గోడు వెళ్ళబుచ్చారు.గతంలో వీటి భారిన పడి ఎంతోమంది ప్రాణాలు కొల్ఫోయారని మహిళలు తమగోడు ను అధికారుల కు వివరించారు. రానున్న రోజుల్లో దుమ్ము గూడెం సీతారామ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ లు నిర్మాణ పనులు పూర్తి అవుతాయని ఏఎన్ఎస్ నేత నర్సింహా మూర్తి అన్నారు. వీటి కారణంగా బ్యాక్ వాటర్ వచ్చి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ గ్రామాలన్నీ నిత్యం ముంపు లోనే ఉంటాయని తెలిపారు. రానున్న రోజులలో వరద ప్రమాదాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరినారు. జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి,ఏ ఎన్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుంజ మహేష్, ఏకన్న గూడెం గ్రామ ఆదివాసీ మహిళలుఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a comment