మలిదశ ఉద్యమకారుడు తుమ్మ మల్లారెడ్డికి సన్మానం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా మలిదశ ఉద్యమ కారుడు తుమ్మ మల్లారెడ్డిని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఏటూరునాగారం మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, పాలెపు శ్రీనివాస్, పోరిక గోవింద నాయక్, తాటి కృష్ణ, పిన్నింటి మధుసూదన్ రెడ్డి, గాదె శ్రీనివాస్, రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మాదరి రామన్న, కోకిల మహేష్, తుక్కాని శ్రీనివాస్, ఈసం రామ్మూర్తి కాకులమర్రి ప్రతీప్ రావు, కావిరి చిన్నికృష్ణ, జాడి భోజ రావు, మరియు తదితరులు పాల్గొన్నారు.