మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒకరు మృతి.

Written by telangana jyothi

Published on:

మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒకరు మృతి.

– ములుగు జిల్లా కొంగాల అటవీ ప్రాంతంలో ఘ‌ట‌న‌

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు  పేలి ఒకరు చ‌నిపోయిన ఘటన సోమ‌వారం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి… జగన్నాపురం గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు (55 ), ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్యలు ఐదుగురు కలిసి క‌ట్టెల కోసం కొంగాల అటవీ ప్రాంతానికి ఉదయం వెళ్లారు. గుట్ట పైకి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన ప్రెజర్ బాంబు పేలగా ఇల్లందుల ఏసు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది తెలుసుకున్న బంధు వులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విలిపిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు దీనిపై కూపి లాగుతున్నారు.

Leave a comment