డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన అఖిల్ కు సన్మానం

డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన అఖిల్ కు సన్మానం

– ఆశయం గ్రంధాలయాన్ని యువత వినియోగించుకో వాలి

– నిరుద్యోగులను ప్రయోజకులను చెయ్యడమే లక్ష్యం

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లిలో గల ఆశయం గ్రంధాలయం ఆవరణలో డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించిన అఖిల్ ను గురువారం  సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్మాణ కర్త దూపటి సతీష్ మాట్లాడుతూ నిరుద్యోగులను ప్రయోజకు లుగా తీర్చిదిద్దదానికి దృఢ సంకల్ప నిర్ణయమే ఈ గ్రంథాల యమని అన్నారు. తన సొంత డబ్బులతో నిర్మించిన గ్రంధా లయం ద్వారా కొంతమందికి అయిన ఉగ్యోగాలు వస్తే వారి తో పాటు వారి కుటుంబాలు కూడా భావి తరాలకు స్ఫూర్తిగా బ్రతుకుతాయన్నారు. గత కొన్ని నెలలుగా గ్రంధాలయంలో కావాల్సిన పోటీ పరీక్షల పుస్తకాలు ఏర్పాటు చేశామని, ఇందులో విద్యను నేర్చుకున్న ప్రతి నిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగిగా తిరిగి రావాలనే ఆశయంతో సన్నద్ధం కావాలని సూచించారు. ఇటీవలే డిఎస్సి ఫలితాల్లో నిరుపేద కుటుం బం నుండివచ్చిన అఖిల్ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధిం చడం మాకు చాలా గర్వంగా ఉందని కొనియాడారు. తన లాగే అందరూ అఖిల్ ని ఆదర్శంగా తీసుకొని మంచి స్థానం లో నిలబడాలని కోరారు. ఈ సందర్భంగా అఖిల్ను ఘనంగా  పలువురు ఘనంగా సన్మానించారు. అనంతరం అఖిల్ మాట్లాడుతూ నేను ఈ ఉద్యోగం సాధించడంలో నాకు మొద టి నుండి సూచన సలహాలు చేస్తూ సతీష్ అన్న చేసిన సహా య సహకారం వలనే నేను ఈ ఉద్యోగం సాదించానని అఖిల్ అన్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంధాలయంలో చదువుకుని వ్యక్తుల్లో మరో ఇద్దరు ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆశయ గ్రంధాలయం నిర్మాణ కర్త సతీష్, గ్రామ సర్పంచ్ చేలా వినయ్,  వివిధ శాఖల  ఉద్యోగస్తులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment