లక్ష్మీదేవి పేట తండాలో తీజ్ వేడుకలు ప్రారంభం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ పరిధి తండాలో గిరిజనులు తీజ్ వేడుకలను గురువారం ఘనంగా ప్రారంభించారు. అజ్మీర రమాదేవి – రాజు ఆధ్వర్యంలో గిరిజనుల సంప్రదాయం ప్రకా రం గోధుమలను తొమ్మిది రోజులు బుట్టలో నానబెట్టి, బుట్ట వద్ద ప్రతి రోజు సాయంత్రం పూజలు నిర్వ హించి సంతోషంగా నృత్యాలు చేస్తారు. తొమ్మిదో రోజు పూర్తయ్యే నాటికి మొల కల్లో కొన్నింటిని గిరిజన పెద్దల తలపాగాల్లో వేసి మిగిలిన వాటిని సమీపంలోని చెరువులో వదలడంతో తీజ్ వేడుకలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో యువతులు, లంబాడ కుల పెద్దలు పాల్గొన్నారు.