బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా

Written by telangana jyothi

Published on:

బెల్ట్ షాపులకు జోరుగా మద్యం సరఫరా

-నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు

తెలంగాణ జ్యోతి, వాజేడు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా స్థావరాల పైన ఉక్కు పాదం మోపుతుండడంతో పల్లెల్లో బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు వైన్ షాపు ల యజమానులు సిండికేట్‌గా మరి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో సరుకును ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయ ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారమే వాజీడు మండలంలోని జరుగుతుంది. మండ లంలోని గెర్రగుడెం గ్రామంలో కనకదుర్గ వైన్స్‌కు సంబం ధించిన ఆటోలల్లో మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. అలా చేయడమే కాకుండా ఎమ్మార్పీ కంటే పది రూపాయలు ఎక్కువగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆ బెల్ట్ షాప్‌లల్లో మద్యాన్ని రూ.15 నుంచి రూ.30 లాభంతో వారు అమ్ముతూ ప్రజల నుంచి డబ్బులను దండుకుంటున్నారు.ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తే మండ లంలోని వైన్ షాపునకు ఎమ్మార్పీ కంటే పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారు కదా మాకు లాభం రావాలంటే 10 రూ, 20 రూ,కంటే అమ్ముకోవాలి అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. ఇదే విషయమై మద్యం దుకాణ యజమాని వివరణ కోరగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ ఆ విషయాన్ని దాటవేస్తుండడం గమనార్హం. అబ్కారీ శాఖకు తెలిసినా కూడా పట్టించుకోకుండా నెలవారి మామూళ్ల మత్తు లోనే మునుగుతున్నారని ఆరోపణలున్నాయి.

Leave a comment