భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

Written by telangana jyothi

Published on:

భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

– వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : రానున్న మూడు నెలల కాలంలో గోదావరి వరదలు, భారీ వర్షాలు కారణంగా వరద ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ములుగు జిల్లా వెంకటాపురం సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు సీతారాంపురం గ్రామ గిరిజను లకు అవగాహన కల్పించారు. ఆదివారం మండల పరిధిలోని భోదాపురం పంచాయతీ మారుమూల అటవీ ప్రాంతమైన సీతారాంపురం గ్రామంలో, గిరిజనులకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక భద్రతాపర మైన అంశాలపై గిరిజనులకు సుదీర్ఘంగా అవగాహన కల్పిం చారు. గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి మాయమాటల వలలో పడవద్దు అని కోరారు. గోదావరి వరదలు సమయంలో చేపల వేటకు వెళ్ళవద్దని, వాగులలో ఈత కు వెళ్ళవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు వరదల సమయంలో పోలీస్ శాఖ తో, పాటు ప్రభుత్వ పౌర శాఖ ల సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, వరదల సమయంలో జరిగే ప్రక్రుతి వైపరీత్యాలు కారణంగా, తీసుకోవాల్సిన ముందు స్తూ జాగ్రత్త లను వరదల సమయం లో ప్రభుత్వ సహాయం తదతర అంశాలపై గ్రామ గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈకార్య క్రమంలో సైబర్ నేరాలపై అవగాహనతో పాటు, బడి వయసు పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులు కోరారు. గ్రామ యువత విద్యా ,ఉద్యోగ, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని, ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను సద్వీనియోగం చేసుకోవాలని, వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు గ్రామ ప్రజలకు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. కమ్యూనిటీ కాంటా క్ట్ ప్రోగ్రాం లో వెంకటాపురం సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now