అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం
తెలంగాణ జ్యోతి, మే19, నర్సంపేట : వరంగల్ జిల్లాలోని నర్సంపేట వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురువడంతో ధాన్యం తడిసి పోయింది. నర్సంపేట పట్టణం లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురువడంతో పట్టణంలోని రోడ్లు జలమయమయి, డ్రె యినేజీలు పొంగి పొర్లాయి. అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. వర్షం, ఈదురుగాలులకు, వరి పంటలు నెలకొరగగా, మామిడి తోటలలో కాయలు నేలరాలాయి. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి అకాల వర్షం కురవడంతో అన్నదాత లబోదిబో మంటున్నాడు. ఖానాపూర్ మండలం, నెక్కొండ మండలం, దుగ్గొండి మండలం, నల్లబెల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు విక్రయించడానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిచి పోయింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు తెలిపారు రైతులు అధర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు.