ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీకి అభినందనలు
– బస్సులో పోగొట్టుకున్న పర్సును ప్రయాణికురాలుకు అందజేత
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న పర్సు ఇతర నగదు వస్తువులను ప్రయాణికు రాలుకు ఆ బస్సు డ్రైవర్ కండక్టర్లు అందజేసి తమ నిజాయి తీని నిరూపించుకున్న సంఘటన పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తూ ప్రయాణికులు, ప్రజలు, అధికారులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వ పరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఆదివారం మంథని నుంచి పెద్దపల్లికి వెళ్లే హెచ్ పి డి వన్ బస్ సర్వీస్ (నంబర్ టీ ఎస్ 22 టీ 7267) మంథని డిపో బస్ లో రాణి అనే ప్రయాణి కురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి మంథనిలో ఎక్కి ఆదివారం పేటలో దిగి వారింటికి వెళ్ళిపోతున్న క్రమంలో బస్సు సీటు కింద పడి ఉన్న పర్సును కండక్టర్ కనుగొని ఆ ప్రయాణికురాలు వద్దకు వెళ్లి ఆధార్ కార్డు ఆధారంగా ప్రయాణికురాలుకు అందజేశారు. ఆ పర్సులో 10 వేల రూపాయల నగదు తో పాటు విలువైన వస్తువులు ఉన్నాయ ని యథాతధంగా ప్రయాణికురాలు రాని కి అందజేశారు మంథని డిపో కండక్టర్ చంద్రమౌళి నిజాయితీని అభినం దిస్తూ ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మంథని పెద్దపల్లి బస్సులలో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్సు డ్రైవరు, కండక్టర్ల నిజాయితీని పలువురు ప్రయాణికులు అభినందనలతో ముంచెత్తారు.