తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగింత
– 24 గంటల్లోనే చేదించిన పోలీసులు..
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన కార్ల వెంకన్న అనే వృద్ధుడు మతిస్థిమితం లేక కాళేశ్వరంలో తప్పిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ ను ఆశ్రయించారు. 24 గంటల్లోనే తప్పిపోయిన వృద్ధుడిని పోలీసులు పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.