బాధితునికి ఫోన్ అప్పగింత
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం: మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన రాంబాబు తన మొబైల్ పొగుట్టుకున్నాడు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో రాంబాబు ఫోను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అట్టి మొబైల్ ఫోన్ ను శుక్రవారం బాధితుడు రాంబాబు కు ఎస్సై వెంకటేష్ పోలీస్ స్టేషన్లో తన చేతుల మీదుగా అందజేశారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను వెతికి అప్పగించిన ఎస్సై వెంకటేష్ కు,సిబ్బందికి ఈ సంద ర్భంగా బాధితుడు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు.