Gutkha | పలు దుకాణదారులపై కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణ జ్యోతి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పలు కిరాణా దుకాణాలపై పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహిం చారు. తనిఖీల్లో అంబర్ ప్యాకెట్లు, గుట్కాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు గూడూరు సీఐ బాబురావు తెలిపారు. నిషేధిత బెల్లం గుట్కా, అంబర్ ప్యాకెట్లు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్సై దిలీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.