గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి
– కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
తెలంగాణ జ్యోతి ములుగు ప్రతినిధి : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలపై అను నిత్యం పోరాడుతున్న ఉద్యమ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ములుగు నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశం ఆదివారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ అభ్యర్ది గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్ది సీతారాం నాయక్తో కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి జాతీయవాద భావాలతో విద్యార్థి సంఘం నాయకునిగా పలు ఉద్యమాలు చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించటంలో గుజ్జుల ప్రేమేదర్ ముఖ్య భూమిక పోషించారని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ లో చేరి ఇఓౄః రాష్ట్ర అధ్యక్షుడిగా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పలు ఉద్యమాలు చేసి అప్పటి ప్రభుత్వాలపై అలుపెరుగని పోరాటాలు చేసిన నాయకుడని అన్నారు. భారతీయ జనతా పార్టీలో వివిధ హొధాలలో పని చేస్తూ నిరంతరం ప్రజల కోసమే పని చేస్తున్న నిస్వార్థ మనిషిగా ఉద్యమ కారుడుగా పనిచేసిన నాయకుడని కొనియాడారు. ప్రజల గొంతుకగా పని చేసే బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి కి మొదటి ప్రధానితో ఓటు వేసి గెలిపించి, శాసనమండలి సభ్యులుగా పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి సభ్యులుగా గెలిపించటం కోసం నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో కృషి చేయాలని, భాజపా ప్రాతినిధ్యంలో అసెంబ్లీలో ఓటు పెరిగేలా చూడాలని, కార్యకర్తలు సైనికుల వలే పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజాగొంతుక కావటానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, అజ్మీర్ సీతారాం నాయక్, జిల్లా ఎంఎల్ సి కో ఆర్డినేటర్ కుమ్మరి శంకర్, ఆజ్మీర క్రిష్ణవేణి, కొత్తసురెందర్, చింతలపూడి భాస్కర్రెడ్డి, తక్కళ్ళపళ్ళి దేవెందర్రావు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, శిలమంతుల రవింద్రచారి, ములుగు మండల అధ్యక్షులు గాదం కుమార్, జాడి వెంకట్, జినుకల క్రిష్ణాకర్ గారు. రాష్ట్ర నాయకులు, జిల్లా పదాదికారులు, మండల అధ్యక్షులు, మండల ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు, సమవ్యయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.