పూసూరులో గుడుంబా పట్టివేత – ఇరువురు అరెస్టు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామంలో బుధవారం గుడుంబా విక్రయాల సమాచారంతో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రుద్ర హరీష్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో గ్రామం లోని దన్నూరు దయాకర్, నల్లబోయిన భాస్కర్ అనే ఇరువురు వ్యక్తుల గృహాల్లో సుమారు 18 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగసారా వ్యాపారులు సతీష్గడ్ నుండి గుడుంబా తీసుకువచ్చి అక్రమంగా అమ్ముతున్నారని, నమ్మ దగిన విశ్వాస నీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు ముందే పసి కట్టిన కొంతమంది దొంగ సార వ్యాపారులు అడవుల్లోకి పరారయ్యారు. ఈ దాడుల్లో వాజేడు సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్. హరీష్, సిఆర్పిఎఫ్ మరియు సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.