ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధులు నివారణ కు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు

Written by telangana jyothi

Published on:

ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధులు నివారణ కు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో కలెక్టర్ ఆదేశాల తో ఈ నెల 3వ తేదీ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాలలో లార్వా సర్వే తో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డి .ఎం .అండ్ హెచ్ .ఓ. డాక్టర్ అప్పయ్య తెలిపారు.  అందులో భాగంగా బుధవారం వెంకటాపురం మండలంలో డి .ఎం .అండ్ హెచ్ .ఓ. డాక్టర్ అప్పయ్య  నూ గూరు, మైతాపురం గ్రామాలలో డాక్టర్ ఆశిష్ ఆరోగ్య సిబ్బంది తో ఇంటింటి సందర్శన నిర్వహించారు. గ్రామంలోని 21 ఇండ్లలో గల నీటి తొట్టెలను, డ్రమ్ములను , ప్లాస్టిక్ గ్లాసులను, టైర్లను సిబ్బందితో నిల్వ నీటిని గుమ్మరించారు. దోమలు కుట్ట రాదు, పుట్ట రాదని పరిసరాల పరిశుభ్రత పై గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. అనంతరం మెడికల్ క్యాంపు నిర్వహించి 35 మందిని పరీక్షించగా కేవలం ఇద్దరు మాత్రమే జ్వరం కేసులు గుర్తించినట్లు తెలిపారు. వెంకటాపురం లోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఓ.పి. ఇన్ పేషెంట్, ఔషధాల నిల్వలు, తదితర అంశాలపై రికార్డుల పరంగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎదిర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్య శ్రీ, డాక్టర్ అశీష్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now