ములుగు జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతం
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో ఆదివారం నిర్వహిం చిన గ్రూప్ 3 పరీక్షలకు అభ్యర్థులు 54.23శాతం మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ములుగులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బండారుపల్లి మోడల్ స్కూల్, బిట్స్ హై స్కూల్, బ్రిలియంట్ హై స్కూల్, సాధన ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, లిటిల్ ఫ్లవర్ స్కూల్, జాకారం సోషల్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2173 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం సెషన్ లో 1182 మంది హాజరయ్యారు. 991 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 54.39శాతం పరీక్ష కు హాజరైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్య హ్నం సెషన్ లో 1175మంది హాజరవగా 998మంది గైర్హాజ రయ్యారు. 54.07శాతం పరీక్షలు రాశారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కాగా, సోమవారం గ్రూప్ 3 మూడవ పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యహ్నం 12.30 గంటల వరకు జరుగ నుంది. అందుకుగాను అధికారులు ఏర్పాట్లు చేశారు.