ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలి

Written by telangana jyothi

Published on:

ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలి

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి: ఈనెల 19వ తేదీన వరంగ ల్ లో జరగబోయే ప్రజాపాలన సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆదివారం పర్యటనలో భాగంగా మేడారం భక్తుల వసతి షెడ్లలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందని సంవత్సరం ప్రజాపాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేసిందని అన్నారు. వరంగల్ నగరంలో జరగబోయే ప్రజా పాలన సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం తాడ్వాయి మండలంలో ఎస్ఐ తాజుద్దీన్ వివాహ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now