కన్నాయిగూడెంలో ఘనంగా ఆదివాసీ  దినోత్సవ వేడుకలు

Written by telangana jyothi

Published on:

కన్నాయిగూడెంలో ఘనంగా ఆదివాసీ  దినోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కొమురం భీమ్ వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలం నాగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆదివాసీ రాష్ట్ర పోలిట్ బ్యూరో అధ్యక్షుడు పోడం బాబు హాజరై మాట్లాడుతూ… ఆదివాసులకు ప్రభుత్వం మరింత సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేపట్టి అధివాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు సంతోష్, చింత గూడెం ప్రధాన ఉపాద్యాయుడు కొరకట్ల రవీందర్,ప్రభాకర్, మధుకర్, జంపయ్య, నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల ఇంఛార్జి జాడి రాంబాబు, చిదరి సుమన్,తడకల మధుకర్ వాసంపల్లి రాంబాబు,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment