కొత్త గుంపు ఆదివాసి గ్రామంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం

Written by telangana jyothi

Published on:

కొత్త గుంపు ఆదివాసి గ్రామంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం

– ఏటూరునాగారం ఏ. ఎస్. పి. శివం ఉపాధ్యాయ

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని, తిప్పాపురం గ్రామపం చాయతీ పరిధిలో గల, కొత్త గుంపు అటవీ గ్రామాన్ని శుక్రవా రం ఏటూరు నాగారం ఎ.ఎస్. పి. శివం ఉపాధ్యాయ ఆధ్వ ర్యంలో కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కొన్నారు. ఆయన మాట్లాడుతూ అనుమానిత,అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని అవగాహన కల్ఫించారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వారి సమస్యలకు తప్ప కుండా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంత రం కొత్త గుంపు గ్రామంలో సిఆర్పిఎఫ్ ఏ/58 బెటాలియన్ యొక్క సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ను ఎఎస్పీ ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు సైకిల్-3, కుట్టు మిషన్లు-2, సింటెక్స్ వాటర్ ట్యాంక్స్-3, సోలార్ లైట్లు-15, వాలీబాల్-6, బాస్కెట్బాల్-4 వాలీబాల్, నెట్లు-2, క్యారం బోర్డ్-1 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూగురు వెంకటాపురం సిఐ బండారి కుమార్, ఏ/58 కంపెనీ కమాం డర్ సన్న ఓబయ్య, వెంకటాపురం ఎస్.ఐ. కొప్పుల తిరుపతి రావు, సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment