ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కన్నాయిగూడెం, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో సోమవారం మాక్స్ (MACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్వీ సర్వర్ పాషా, వ్యవసాయ అధికారి ముంజా మహేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే వరి ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తగిన మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ కళ్యాణి, ఆర్ఐ గణేష్, చిట్టం శ్రీనివాస్, కొనుగోలు కేంద్ర ఇన్చార్జి పూజారి వెంకటేష్, రైతులు పూజారి నరేష్, మంగలార సత్యం, సంతోష్‌తో పాటు మహిళలు, హమాలీలు పాల్గొన్నారు.






