ఉపాధిహామీ పనులపై పర్యవేక్షణ కరువు..?
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశ పెట్టిన ఉపాధిహామీ పథకం సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గాడి తప్పుతుంది. ప్రతి ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా..గతంలో ఉపాధిహామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలను గుర్తిస్తున్నా మార్పు కనిపించడం లేదు. గత ఏడాది ఉపాధి హామీ పథకంలో ఇంటింటికీ సర్వే నిర్వహించారు.గ్రామానికి ఒక్కరిని సర్వే ఏజెంట్ నియమించారు. ఇందులో భాగంగా ప్రజావేదిక సమావేశంలో జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సర్వే లో రెండు లక్షలు దుర్వినియోగం అయ్యినట్లు గుర్తింగా 70 వేల రికవరీ చేయాలని పైఅధికారులు ఆదేశిం చారు. గతంలో జరిగినట్టు పనికి వెళ్లకుండా వెళ్లినట్టు పేర్లు నమోదు అవుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నిధుల దుర్వినియోగం కన్నాయిగూడెం మండలంలో ఉపాధిహామీ పథకం అమల్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలు చోటుచేసుకుంటు న్నాయి. ఏటా చేపడుతున్న పనుల్లో కనీసం 20 శాతానికి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేయకున్నా చేసినట్లు చూపడం, చేపట్టాల్సిన పనుల్లో మార్పులు, ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపు, పరిమితికి మించి ఇతర ఖర్చులు చేస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏటా జరుగుతున్న ఉపాధి పనుల్లో కొన్ని లక్షల్లో ఈ తరహా దుర్వినియోగమవుతున్నట్లు ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో వెల్లడవుతోంది.
మండలంలోని అక్రమాలు
ఉపాధిహామీ పనులకు బదులు ఎక్కువగా కొలతలు రికార్డ్ చేయడం, బినామీ వ్యక్తులుగా మస్టర్లు వేయడం, పనులు చేసిన వారికి వేతనాలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగు తుండగా పని చేయని వారికి వేతనాల చెల్లింపులు,టి ఏ లు, ఫీల్డ్ ఆసిస్టెండ్లు, ఆపరేటర్ కుమ్మక్కు అయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జరుగుతుండగా జిల్లా అధికా రులుచూసిచూడనట్లుగా వ్యవహారించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఉపాధి హామీ పను లపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది.