సీఎం కప్ లో కాటారం ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ 

సీఎం కప్ లో కాటారం ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ 

సీఎం కప్ లో కాటారం ట్రైబల్ స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : సీఎం కప్ లో కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధిం చారు. గత నెలలో నిర్వహించిన పోటీల్లో భూపాలపల్లి జిల్లా తరుపున ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ హ్యాండ్ బాల్ క్రీడలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతి నిధ్యం వహించారు. అలాగే వాలీబాల్, హ్యాండ్ బాల్ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించి లక్ష రూపాయలు నగదును అందుకున్నారు. అందులో కాటారం ట్రైబల్ గురు కులం క్రీడాకారులు ఉండడం చాలా సంతోషకరమైన విషయ మని కళాశాల ప్రిన్సిపాల్ బి లాలు, వైస్ ప్రిన్సిపల్ హెచ్ రాజేందర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. గోల్డ్ మెడల్ పతకాన్ని సాధించడం పట్ల కళాశాల పిడి మహేందర్, పిటి శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, కళాశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment