కేజిబీవిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాల న నిర్వహించారు.గురువారం విద్యార్థిని,విద్యార్థులు హరిదాసు, బసవన్నల వేషధారణలువేశారు.రంగవల్లులు,బొమ్మల కొలువు, భోగిమంటలు, భోగిపళ్లు, కోడి పందాలు, గాలిపటాలు ఎగుర వేయడం, పిండి దంచడం, పిండి తిరగలి లో విసరడం, సకినా లు పోయడం, సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపే పాటలపై నృత్యాలు చేసారు. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి ప్రిన్సి పాల్ చల్ల సునీత వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయి నిలు విజయ సరిత, అరుణ, సుజాత, మణిమాల (రాజమణి), స్వప్న, కవిత, శ్రీలత, లక్ష్మి శిరీష, రమ్య, నళిని విద్యార్థినిలు పాల్గొన్నారు.