మేడారంలో న్యాయ దేవతలు!
మేడారం, తెలంగాణ జ్యోతి : జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ములుగు ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసి మ్యూజియం ఆవరణంలో లీగల్ ఎయిడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీపీ లలితా శివ జ్యోతి లీగల్ ఎయిడ్ స్టాల్ ని ప్రారంభించి మాట్లాడుతూ న్యాయ సేవాధికారి సంస్థ కార్యక్రమాలన్నీ ఈ యొక్క లీగల్ ఎయిడ్ స్టాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన ఉ చిత న్యాయ సహాయం, రైతుల సాగు చట్టాలు న్యాయ- సహాయం, సమాచార హక్కు చట్టం, ర్యాగింగ్ నిషేధ చట్టం, ఫోక్స్ చట్టం, కుటుంబ తగాదాలు న్యాయసహా యం, న్యాయ సహాయం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల చట్టం గురించి కరపత్రాలు ఈ లీగల్ ఎయిడ్ స్టాల్ లో ఏర్పాటు చేశాం. కావున మేడారం జాతరకు వచ్చే ప్రజలు ఇట్టి లీగల్ ఎయిడ్ స్టాల్ ని సందర్శించి న్యాయ సేవాధికార సంస్థ గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ములుగు ములుగు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ జడ్జి టి. మాధవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌఖ్య, డిప్యూటీ చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ బానోతు స్వామిదాస్, పారా లీగల్ వాలంటీర్ యూకే శేఖర్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఓంకార్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.