మేడారం మహా జాతర సందర్భంగా గ్రామాలన్నీ నిర్మానుషం.
– తరలి వెళ్లిన వేలాది భక్తజనం – రహదారులన్ని నిర్మానుష్యం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మేడారం మహా జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుండి వందలాది గ్రామాల నుండి అశేష భక్తజనం మేడారం జాతరకు తరలి వెళ్లడంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ ప్రాంతం నుండి సుమారు 45 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కు వేలాదిమంది భక్తులు రేయింబవళ్లు ప్రత్యేక బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు తో ఆబాల గోపాలం మొక్కుబడుల నిమిత్తం మేకపోతులు, పొట్టేళ్ళు, కోడి పుంజులు వంట సామాగ్రితో తరలి వెళ్లడంతో గ్రామాలన్నీ నిర్మాణుస్యంగా మారాయి. రెండేళ్లకు ఒకసారి వచ్చే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర కు ఐదు, ఆరు నెలల ముందు నుండే శ్రీ సమ్మక్క సారలమ్మ భక్తులు ముందస్తు ప్రణాళికలతో, మొక్కుబడులను తీర్చు కునేందుకు నిండు జాతరకు ముందు నుండే వేలాదిగా, లక్షలాదిగా భక్తులు తరలి వెళ్ళే చరిత్ర ఈ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా ఉన్నది. అంతేకాక వారి, వారి కుటుంబ సంతానాలకు శ్రీ సమ్మక్క, సమ్మయ్య,, స, అక్షరం మీద పసిబిడ్డలకు నామకరణం చేసి తమ కులదైవంగా, ఇంటి ఇలవేల్పుగా ఆరాధ్య దైవంగా అభిమానించి పూజించే ఆదివాసీల, ఆరాధ్య దైవంగా కుల,మతాలకు అతీతంగా కోరిన, కోరికలు తీర్చే శ్రీ సమ్మక్క సారలమ్మను పూజించి మొక్కుబడును చెల్లిస్తే శుభం కలుగుతుందని ,ఈ ప్రాంత భక్తుల నమ్మకం అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణ కేంద్రం మీదుగా భద్రాచలం చుట్టుపక్కల నుండి , ట్రాఫిక్ కారణంగా వాహన శ్రేణులు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, జగన్నాధపురం వై జంక్షన్ మీదుగా పూసూరు గోదావరి భారి వంతెన మీదుగా ఎటునాగారం, తాడ్వాయి మీదుగా వేలాది వాహనాల శ్రేణులు మేడారం మహా జాతరకు చీమల బారుగా తరలి వెళ్తున్నారు. వేలాది , లక్షలాది, కోట్ల భక్తులతో మేడారం చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో భక్తులు గుడారాల ఏర్పాటు చేసుకొని అమ్మవార్లను దర్శనం చేసుకొని, అక్కడే మొక్కుబడులు చేయించుకొని మకాం ఉండేందుకు ఏర్పాటు లను ముందుగానే ఏర్పాటు చేసుకొని తరలి వెళ్లారు. ఈ మేరకు వెంకటాపురం మండల కేంద్ర నుండి మరియు చర్ల, ఎటునాగారం ప్రాంతాల నుండి సత్తుపల్లి టిఎస్ఆర్టిసి డిపో నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక బస్ స్టేషన్ మేడారం బస్సుల స్టాల్స్ వద్ద, వైద్య ఆరోగ్య శిబిరం ల తో పాటు మంచినీటి వసతి కల్పించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. 24 గంటల పాటు మేడారం భక్తులు వెళ్లేందుకు, ప్రత్యేక మేడారం బస్సులు సిద్ధంగా ఉండటం తో పాటు, గద్దెల సమీపం వరకు ప్రభుత్వ బస్సులు వెళుతుండడంతో, వేలాదిమంది భక్తులు టిఎస్ఆర్టిసి ప్రత్యేక స్పెషల్ బస్సులు లో వెళ్లి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూబుతు న్నారు. అలాగే ఈ ప్రాంతం నుండి మేడారం వెళ్లే భక్తులకు స్వల్ప అస్వస్థ గురి అయితే వెంకటాపురం బస్ స్టేషన్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంతేకాక మేడారం వెళ్లే భక్తులకు టిఎస్ఆర్టిసి సత్తుపల్లి డిపో సిబ్బంది మైకు ద్వారా మేడారం వెళ్లే భక్తులను ఆహ్వానిస్తున్నారు. మహిళలకు ప్రభుత్వపరంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో బస్సుల్లో మేడారం మహిళా భక్తులకు ఉచితమని, పురుషులకు పెద్దలకు 150 రూపాయలు, టికెట్ అని పురుష పిల్లలకు 80 రూపాలు హాఫ్ టికెట్ అని ప్రచారం చేస్తున్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి అమ్మ వార్ల గద్దెల వరకు వెళ్లి శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని, సత్తుపల్లి డిపో ఆర్టీసీ స్పెషల్ బస్ సిబ్బంది మైకు ద్వారా ప్రచారం చేస్తుండటంతో చర్ల, వెంకటాపురం, ఏటూరు నాగరం నుండి మేడారం వెళ్లే స్పెషల్ బస్సులు నిండుగా వెళ్తూ, మేడారం చేరుకుంటు న్నాయి. అలాగే మేడారం నుండి తమ, తమ స్వగ్రామ పాయిట్లకు వచ్చే స్పెషల్ బస్సులు కూడా అదే రీతిలో వస్తుండటంతో ప్రయాణికులు స్పెషల్ బస్సులు పట్ల ఆకర్షితులై మేడారం జాతరకు తరలి వెళ్తున్నారు. బస్సు ఎక్కే సమయంలో బస్సు బయలుదేరే ముందు జై సమ్మక్క తల్లి, జై జై సార్లమ్మ తల్లి అంటూ భక్తులు సమ్మక్క తల్లిని కొనియాడుతూ, సురక్షితంగా తమకు దర్శనభాగ్యం కల్పించాలని వేడుకుంటున్నారు.