మేడారం జాతరకు మొదలైన మొక్కుబడుల సందడి.
– ఆకాశాన్ని అంటిన మేకపోతులు, నాటు కోడి పుంజుల ధరలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి ప్రతినిధి : మహా కుంభమేళ మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు మొక్కు బడులను చెల్లించుకునేందుకు భక్తులు మేకపోతులు, పొట్టేలు, నాటు కోడి పుంజులు, నాటు కోళ్లు కోసం గ్రామ గ్రామాన కొనుగోలు చేసేందుకు, ఇంటిం టిని జల్లడ పడుతూ తిరుగుతున్నారు. రెండు మూడు నెలల క్రితమే వాటి కొరత వుంటుందని వాటిని కొనుగోలు చేసుకుని మొక్కుబడులు చెల్లించు కునేందుకు భక్తులు, ముందుగానే వాటిని సిద్ధం చేసుకున్నారు. దీంతో మేకపోతులు, పొట్టేలు, నాటు కోడి పుంజులు, నాటు కోళ్లకు ధరలు ఒక్క సారిగా ఆకాశాన్ని అంటాఇ. ఒక్కో మేకపో ధర సుమారు పది కిలోలు బరువు ఉండే దానిని 20 వేల రూపాయల నుండి 24 వేల రూపాయలు వరకు ధరలు పలుకుతున్నాయి. అలాగే నాటుకోడి పుంజు లు, పీస్ రేటు క్రింద నుండి 12 వందల రూపాయల నుండి, 15వందల రూపాయల వరకు ధరలు పలుకు తున్నాఇ. అయినా కానీ అవి దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని పశువుల సంతలకు వెళ్లి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతకు మొక్కులు చెల్లించు కునేందుకు ధరల ను సైతం వెనకాడకుండా వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు కుటుంబాలు యావత్తు వెంకటాపురం, వాజేడు ప్రాంతాల నుండి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా ఆయా మేకపోతులు, పొట్టేళ్లకు మెడలో వేపాకులు దండలు కట్టి ముడుపులు కట్టి, బొట్టు పెట్టి శ్రీ సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు, సిద్ధమవు తున్నారు. అయితే మేడారం మహా జాతర తేదీలకు ముందు నుండే గత రెండు నెలలుగా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతం నుండి మేడారంను సందర్శించి అమ్మ వార్లకు పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించు కుంటున్నారు. ములుగు జిల్లా వెంకటా పురం, వాజేడు ఏజెన్సీ ప్రాంతంలో మేడారం మహా జాతరకు రెండు నెలల ముందు నుండే భక్తులు మేడారం వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని, అమ్మవారి బంగారాన్ని వారి, వారి గ్రామాల్లో ఇరుగు పొరుగు వారికి శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రసాదంగా బంగారాన్ని బెల్లాన్ని పంపిణీ చేస్తూ, శ్రీ సమ్మక్క సారలమ్మ మహాతల్లి కరుణాకటాక్షంతో, సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కుటుంబాలు యావత్తు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని, మహాత్యం గల అమ్మగా ఈ ప్రాంతంలో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి ని వేడుకుంటున్నారు. అలాగే దశాబ్దాల కాలంగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి పేర్లను వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలకు , పసిబిడ్డలకు ,స.పేరుతో నామకరణం చేసి, అమ్మవారిని భక్తులు మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మకు అశేష భక్తులు నిరాజనాలు పలుకు తున్నారు.