కోఆర్డినేషన్ మీటింగ్ అని ప్రెస్ మీట్.
– జర్నలిస్టుల అసంతృప్తి
– స్థానిక జర్నలిస్టులకు ప్రియారిటీ ఇవ్వాలని డిమాండ్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మేడారం మహా జాతర సందర్భంగా విధులు నిర్వర్తించే జర్నలిస్టులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన అధికారులు కేవలం ప్రెస్ మీట్ నిర్వహించి మమ అనిపించారు. తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించిన జర్నలిస్టుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మరియు ఎస్పి కేవలం చేపట్టిన పనులు తెలపడంతో నివ్వెర పోవాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వడంతో ములుగు జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ములుగు లో సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ షఫీ, భేతి సతీష్, దేవేందర్, సునీల్, కిరణ్ తదితరులు తాము మేడారం కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నామని డిపిఆర్వో రఫిక్ కు తేల్చి చెప్పారు. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర పై తమకు ప్రయారిటీ ఇవ్వకుండా అవమాన పరిస్తున్నా రని అన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టులను డిపిఆర్వో సమన్వయ పరిచి మేడారం తీసుకెళ్లారు. అయితే జాతర పై సమన్వయ సమావేశానికి బదులు కలెక్టర్, ఎస్పి లు ప్రెస్ మీట్ పెట్టడంతో తమను ఎందుకు పిలిచారని అధికారులను ప్రశ్నించారు. ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం జర్నలిస్టులు కలెక్టర్ ప్రెస్ మీట్ కు హాజరు కాలేదు. జాతరలో స్థానిక జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోకపోవడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటూరునాగారం నుంచి వచ్చే జర్నలిస్టులకు వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.