మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభో..!
– పెద గంగారం గ్రామస్తుల వినతి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పెద గంగారం గ్రామంలో గత పది రోజులుగా మంచినీళ్లు బందు కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి సరఫరా పథకం లో వచ్చిన లోపాలు, రిపేర్లు కారణంగా మరమ్మత్తులు చేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ మోటార్ స్టార్టర్ ల రిపేర్లతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై గ్రామస్తులు పది రోజులుగా పంచాయతీ కార్యదర్శికి మొర పెట్టుకున్న పట్టించుకోవటం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి పంచాయతీ ప్రజలకు అందుబాటులో లేకుండా దూర ప్రాంతాల్లో నివసిస్తూ, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని, మంచినీరు బంద్ అయి పది రోజులైనా పట్టించుకోవటం లేదని గ్రామ స్తులు ములుగు జిల్లా ఉన్నతాధికారులకు చర వాణీ ల ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమకు మంచినీళ్లు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని, గ్రామస్తులు మంచినీటి సరఫరా పథకం పని చేయకపోవడంతో కలుషితమైన మంచి నీళ్లు తాగి అస్వస్థకు గురవుతున్నామని, జిల్లా ఉన్నతా ధికారులు వెంటనే స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ముక్త కంఠంతో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.