ధర్మారం ఇసుక క్వారీలో భారీ అక్రమాలు..?

Written by telangana jyothi

Published on:

ధర్మారం ఇసుక క్వారీలో భారీ అక్రమాలు..?

– అదనపు బకెట్లు కు 4 వేలు వసూళ్లు. 

– లోడుకు 5,000 రూపాయలు వసూళ్లు. 

– అధికారులు లేకుండానే నేరుగా లోడింగ్. 

– పట్టించుకోని టీఎస్ఎండిసీ అధికారులు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గోదావరి ఇసుక క్వారీలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గోదావరి వరదలు ,భారీ వర్షాలు దృష్టి లో ఉంచుకొని, క్వారీల వద్ద టీఎస్ఎం .డి.సీ. అధికారులు లేకుండానే రోజుకు 10 నుంచి 20 లారీల వరకు ఇసుకను తరలించి పోతున్నారు. ధర్మవరం ఇసుక క్వారీ నుండి, చింతూరు పంచాయతీలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఒక బినామీ కాంట్రాక్టర్, 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ధర్మారం ఇసుక క్వారీ నుండి లక్ష్మీపురం కు డంప్పింగ్ చేయించుకున్నారు. ప్రధాన ఇసుక మాఫియా కాంట్రాక్టర్.తో చేసుకున్న ఒప్పందం ప్రకారం, తాను కొనుగోలు చేసుకున్న 60 వేలక క్యూబీ క్ మీటర్ల ఇసుకను, గోదావరి వరదలు, భారీ వర్షాలు కారణంగా, ఇసుక కు డిమాండ్ వుండటంతో లక్ష్మీ పురం నుండి ,రోజుకు 10 నుండి 20 లారీల వరకు, టీఎస్ ఎస్ఎండిసి అధికారులు క్వారీ వద్ద లేకుండానే, బకెట్ కు 2,000 చొప్పున, అదనపు బకేట్లు దందా సాగుతున్నది. లారీలను ఇసుక లోడ్ చేసీనందుకు అఇదు వేల వంతున వసూలు చేస్తున్నారు. మూడు బకెట్లు కొనుగోలు చేసిన వారికి 1,000 రూపాయలు రాయితీ ప్రకటిస్తూ, ఇసుక మాఫియా ప్రకృతి సంపదలను దోపీడీ చేస్తున్నారు. ఇసుక లోడింగ్ కు గతంలో 3500 వసూలు చేసిన రేసింగ్ కాంట్రా క్టర్లు, లారీలు దిగబడితే జేసీ బి లతో నెట్టాలని ,అనే సాకు చూపించి ఒక్కొక్క లారీ నుండి 5,000 రూపాయలు వరకు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపి స్తున్నారు. లారీలపై పరధాలు కట్టి, రహదారులపై వచ్చేపోయే ప్రజలపై ఇసుక పడకుండా ఉండేందుకు అధికారుల ఆదేశా లను భేఖార్ తో పరదాలు లేకుండానే ఓవర్ లోడ్ లారీలు తో రహదారు లు ధ్వంసం అవుతున్నాఇ. లారీలపై పర్దాలు కట్టకుండానే ఓవర్ లోడు తో ప్రధాన రహదారిపై లారీలు పరుగులు తీస్తున్నాయి. దీంతో రహదారిపై వెళ్లే వారి పై , వాహనాలపై ఇసుక పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇసుక లారీల పై నుండి ఇసుక చిమ్మి ,ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే ఇదంతా అధికారుల కను సన్నలలో జరుగుతుందని ,అసలు టిఎస్ఎండిసి అధికారులు లేకుండానే లోడింగ్ జరుగు తుందని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇసుక క్వారి పరిధిలోని గ్రామాల కూలీల ఒప్పందం ప్రకారం, లక్ష్మీపురం ప్రాంతంలో లోడింగ్ అయ్యే లారీలకు ధర్మారం ప్రాంత కూలీలు పర్దాలు కట్టాలని ఒక్కొక్క లారీకి ₹1000 లారీ డ్రైవర్లు కూలీలకు పట్టాలు కట్టినందుకు ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇసుకలోడిం గ్ తతంగం అంతా గత వారం రోజులుగా జరుగుతున్న, అధికారులు పట్టించుకోక పో వడం పట్ల ప్రజలు భాహాటంగా విమర్శిస్తున్నారు .ఇసుక మాఫియా ప్రభుత్వ ఖజానాకు గండికోడుతూ, లారీల నెంబర్ ప్లేట్లను మార్చి ఒకే పర్మిట్ పై టీడీలతో రెండు లారీ ఇసుక దోపిడీ ఫార్ములాను విధేయతకు నిర్వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ధర్మారం ఇసుక ర్యాంపులు లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని, ఈ ప్రాంత ప్రజలు ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా ఎస్పీ, టీఎస్ఎండిసి అధికా రులకు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment