గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి
– వినాయక నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్లు నిషేధం
– ఎస్సై వెంకటేష్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వ హించుకోవాలని ఎస్సై వెంకటేష్ భక్తులను కోరారు. వినాయ కుని నిమజ్జనాల ఊరేగింపులో డీజే సౌండ్స్ సిస్టం లు వాడ రాదన్నారు. ఊరేగింపు సమయంలో వాహనాలపై చిన్న పిల్ల లను ఎక్కించారదని,సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద వినాయ కుని నిమజ్జనం ఉత్సవాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు. బ్యారేజ్ వద్ద నిమజ్జనం సమయంలో వాహనాలు ఒకటి తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో నిబంధనలు పాటించి నిమ జ్జనం చేయాలి. నిమజ్జనం సందర్భంగా చిన్నపిల్లలు దూరం గా ఉండాలన్నారు.ఊరేగింపు సమయంలో విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, బెల్టుషాపుల్లో మద్యం అమ్మరాదని, గణేష్ ఉత్సవ కమిటీలు ఎవరైనా పోలీస్ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్య లు తీసుకోవడం జరుగుతోందన్నారు.నవరాత్రి ఉత్సవ కమిటీలు భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలని, ఈ సందర్భంగా ఉత్సవ కమిటీలకు ఎస్సై వెంకటేష్ సూచించారు.