గణేష్ నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
– బాణాసంచా డీజేలకు అనుమతి లేదు.
– నిమజ్జన ఏర్పాట్లకై పోలీస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
– ములుగు జిల్లా ఎస్పీ.డా. శబరీష్.
ములుగు ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా సి.సి. కెమెరాల ద్వారా నిమజ్జన ప్రాంతాలలో నిఘా వ్యవస్థ పర్యవేక్షణ జరుగుతుం దని, గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో శాంతియు తంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపిఎస్ భక్తులను కోరారు. ములుగు జిల్లాలో ప్రజ లందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావ రణంలో పూర్తి చేసు కోవడం జరిగిందన్నారు. అదే విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని సైతం ప్రశాంతంగా నిర్వహించు కోవాలని ఎస్.పి. తెలియ జేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో విధులను నిర్వర్తి స్తుందని, నిమజ్జన కార్య క్రమానికి ములుగు జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసు సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా ముళ్లకట్ట గోదావరి బ్రిడ్జి వద్ద మరియు ములుగు పట్టణంలో తోపుకుంట చెరువు, జంపన్న వాగు వంటి ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో డీ. ఎస్పీ,సీ.ఐ అధికారు లను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని, ఇతర గ్రామాల లో స్థానిక పోలీసులు ప్రజల సంరక్షణ కో సం అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే పెట్రోలింగ్ నిర్వహిస్తూ పర్య వేక్షించడం జరుగుతుందని తెలిపారు.
పోలీస్ స్టేషన్ ల వారిగా నిమజ్జన ప్రాంతాలు…
ములుగు – తోపుకుంట చెరువు
వెంకటాపూర్ – గ్రామ స్థానిక చెరువులు, జవహర్ నగర్ చెరువు మరియు తోపుకుంట చెరువు.
పస్రా – గౌరారం ట్యాంక్, చల్వాయి
తాడ్వాయి – జంపన్న వాగు
ఏటూరునాగారం – గోదావరి నది, ముల్లకట్ట
కన్నాయిగూడెం – తుపాకులగూడెం బ్యారేజ్ మరియు గోదావరి నది ముళ్లకట్ట
వాజేడు – గోదావరి నది,ముల్లకట్ట వంతెన ప్రాంతం
వెంకటాపురం – బల్లకట్టు వాగు
మంగపేట – గోదావరి నది ముళ్లకట్ట
పేరూరు – గోదావరి ఫెర్రి పాయింట్
లతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు నిమజ్జన ప్రాంతాలలో సీ.సీ. కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింద ని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుం దని ప్రజలందరూ గణేష్ నిమజ్జన శోభాయాత్రను, భక్తి భావం తో శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శభరీశ్ భక్తులకు తెలియజేశారు.