అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడిగా గద్దల మహేష్

Written by telangana jyothi

Published on:

అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడిగా గద్దల మహేష్

కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కాటారం మండలం లోని గంగారం గ్రామంలో ఏర్పాటు చేయబోయే డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడిగా గద్దల మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం గంగారం ఎస్సీ యూత్ సభ్యులు సమావేశం ఏర్పాటుచేసుకుని అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకై కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గద్దల మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దామెర లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా నీలాల వరుణ్, ప్రధాన కార్యదర్శిగా కనకం రాకేష్, కార్యదర్శులుగా చీపెల్లి చిన్ని, తోటపల్లి లక్ష్మణ్, కోశాధికారిగా చిట్యాల కుమార్, అధికార ప్రతినిధిగా నీలాల బాపు, ప్రచార కార్యదర్శిగా గురుకుంట్ల అశోక్, సంయుక్త కార్యదర్శిగా మారపాక పోచయ్య, సహాయ కార్యదర్శిగా శనిగరం నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గద్దల మహేష్ మాట్లాడుతూ గంగారం గ్రామం లో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకై చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ నియామకానికి తొడ్పాటునందించిన గంగారం ఎస్సీ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

Leave a comment