తపాల సేవలను సద్వినియోంచుకోవాలి

Written by telangana jyothi

Published on:

తపాల సేవలను సద్వినియోంచుకోవాలి

– పోస్టల్ ఇన్ స్పెక్టర్ సయ్యద్ అజారుద్దీన్

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తపాల శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ తపాల పొదుపు పథకాలను, సేవలను దామెరకుంట గ్రామ ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని తపాల శాఖ ఇన్ స్పెక్టర్ సయ్యద్ అజారుద్దీన్ కోరారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని దామెరకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (డి సి డి పి) లో వివిధ వయసులో ఉన్న బాలికలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, గ్రామీణ ప్రజలకు తపాలా శాఖలోని సుకన్య సమృద్ధి యోజన (ఎస్ ఎస్ ఏ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ( ఎస్ సి ఎస్ ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీ పి ఎఫ్) ఇతర పథకాలు తపాల జీవిత బీమా (పి ఎల్ ఐ), గ్రామీణ తపాల జీవిత బీమా (ఆర్ పీ ఎల్ ఐ), ఎలా ఉపయోగ పడతాయోనని ఉదాహరణలతో వివరించారు. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్ సేవలు, ఆధార్ సహిత చెల్లింపులు, యాక్సిడెంట్ పాలసీలు గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న తపాల శాఖను కొనియాడుతూ, తాను గత పది సంవత్సరాలుగా సేవింగ్స్ ఖాతాను ఉపయోగిస్తున్నానని గుర్తు చేశారు. చేరువలోని పోస్ట్ ఆఫీస్ లోని పొదుపు పథకాలలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని సబ్ డివిజన్ పోస్టల్ ఇన్ స్పెక్టర్ సయ్యద్ అజారుద్దీన్, దామెరకుంట మాజి ఉపసర్పంచ్, దానేరకుంట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ భార్గవి, దామెరకుంట గ్రామ ప్రజలు, ఖాతాదారులు, మెయిల్ ఓవర్సీస్ జి రాజు,సత్యం, స్థానిక తపాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment