బాధితులకు మాజీ ఎంపిటిసి చేయూత
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన కుటుంబాలను పరామర్శించి వారికి కాటారం మాజీ ఎంపిటిసి తోట జనార్ధన్ చేయూత అందించారు. కాటారం మండల కేంద్రంలోని గంట గూడెం, దుబ్బగూడెం ప్రాంతాలకు చెందిన కొండ దీప ముత్యాల పోచం, మ్యాడమ్ సమ్మయ్య కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహయం చేశారు. అదేవిధంగా అదే కాలనీలో తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని ప్రజలు మొరపెట్టు కున్నారు. అక్కడ ఉన్న బోరు మోటర్ చెడిపోవడంతో, కొత్త బోర్ మోటార్ ఇప్పించి మాజీ ఎంపిటిసి తోట జనార్ధన్ ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు జోడు శ్రీనివాస్, తోట బాబు, గంట శ్రవణ్, కొండగొర్ల వెంకటస్వామి, కొండ తిరుపతి, గాలి సడవలి తదితరులు పాల్గొన్నారు.