కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం
– మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు
– ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు
ములుగు ,మార్చి 14: ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క లకు తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున, తెలంగాణ ఎరుకల జాతి తరపున ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లూకింగ్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల జనాభా కలిగి ఉండి విద్యా ఉద్యోగ ఉపాధి లేక రాజకీయంగా అవకాశాలేక అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడము తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ హర్షిస్తుంది అని అన్నారు. మొత్తం 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం పట్ల రాష్ట్ర క్యాబినెట్ కి అభినందనలు తెలిపారు.