విద్యార్థులే ఉపద్యాయులైన వేళ
– అమరావతి విద్యాలయం లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
వెంకటాపూర్ ,మార్చి 14 : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట అమరావతి విద్యాలయం లో విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా డీఈఓ గా కె అవినాష్, ఎంఇఓ గా యం వరుణ్, ప్రధానోపా ధ్యాయులుగా పి రమ్య , పి ఈ టి లుగా బి ధరణి, ఆర్ వంశీ అటెండర్ లుగా పి రామ్ చరణ్, వేణు ఉపాధ్యాయులుగా యం పల్లవి,జి అఖిల, ఎస్ దివ్య ,చరణ్, అఖిల, అంజలి, కావ్య, అభిలాష్, మోహన్, వైష్ణవి లు వ్యవహరించారు. అనంతరం అమరావతి విద్యాలయం ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క రోజు ఉపాధ్యాయ బోధనలో ఎదుర్కొన్న అనుభవాలను తాము భవిష్యత్లో ఏ రంగంలో రానించలనుకున్నరో వెల్లడిం చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరగాని రాజయ్య మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిలా శ్రమించి బోధిస్తే విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ మూల రాజయ్య, వీరాగాని ఆనందం, అంతటి సుమలత,ఉపాధ్యాయులు జేరుపోతుల కిరణ్,బి జైపాల్, వైనాల కిరణ్ , నవ్య, మౌనిక, కవిత, రోజా, ఇందుశ్రీ తదితరులు పాల్గొన్నారు.