పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం

పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం

  • ముఖ్య అతిథిలుగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు ,టాస్క్ ఫోర్స్ ఎస్సై తాజుద్దీన్

వెంకటాపూర్  ప్రతినిధి : వెంకటాపూర్ మండల కేంద్రంలోని పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు , టాస్క్ ఫోర్స్ ఎస్సై తాజుద్దీన్ లు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు ఈ సందర్భంగా పరమేశ్వర బ్రిక్స్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సాద యాదగిరి, మిల్కురి ఐలయ్య,ఉత్సవ కమిటీ సభ్యులు చింతిరెడ్డి రమణారెడ్డి,ముప్పు పుర్నెందర్, పల్నాటి సురేష్, అరవింద్, రామిడి కర్ణకర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment