పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం
- ముఖ్య అతిథిలుగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు ,టాస్క్ ఫోర్స్ ఎస్సై తాజుద్దీన్
వెంకటాపూర్ ప్రతినిధి : వెంకటాపూర్ మండల కేంద్రంలోని పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు , టాస్క్ ఫోర్స్ ఎస్సై తాజుద్దీన్ లు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు ఈ సందర్భంగా పరమేశ్వర బ్రిక్స్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సాద యాదగిరి, మిల్కురి ఐలయ్య,ఉత్సవ కమిటీ సభ్యులు చింతిరెడ్డి రమణారెడ్డి,ముప్పు పుర్నెందర్, పల్నాటి సురేష్, అరవింద్, రామిడి కర్ణకర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.