సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు – నేటి నుంచే అమల్లోకి

సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు - నేటి నుంచే అమల్లోకి

సిమెంట్‌ ధరలు పెంచిన సంస్థలు – నేటి నుంచే అమల్లోకి

డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్‌ ధరలు పెరిగాయి. సిమెం ట్‌ ధరల్ని పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకు న్నట్లు తెలిపాయి. ధరలు సవరించిన వాటిలో అల్ట్రాటెక్‌, ఇండియా సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, రామ్‌కో, ఏసీసీ, ఇండియా సిమెంట్స్‌ సహా ప్రధాన సిమెంట్‌ కంపెనీలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్‌ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచిందని జాతీయ మీడియా పేర్కొంది. తమిళనాడులో రూ.10-20 పెంచినట్లు తెలిపింది. సవరించిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ముడిసరుకులు, పెరుగుతున్న రవాణా ఖర్చుల్ని తగ్గించు కోవడంలో భాగంగా సిమెంట్‌ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణరంగంతో పాటు మౌలిక సదుపాయాల కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment