GOA : గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్

GOA : గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్

GOA : గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్

– సికింద్రాబాద్ నుంచి గోవాకు ఇకపై 2 ట్రైన్లు

ఇంటర్నెట్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా గోవా(goa) వెళ్లాలని అనుకున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పటినుంచో సికింద్రాబాద్(Secunderabad) నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కొత్త రైలును ప్రవేశపెట్టినందుకు ప్రధాని, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరుతూ కిషన్ రెడ్డి మార్చి 16న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సమస్యను వివరిస్తూ కొత్త రైలు కోసం అభ్యర్థన చేశారు. సికింద్రాబాద్, గోవా మధ్య కొత్త బై వీక్లీ రైలును ప్రవేశపెడుతున్నట్లు భారతీయ రైల్వే ఇటివల ప్రకటించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్-వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.

ఈ ప్రాంతాలగుండా.. : ఇది వాస్కోడగామా చేరుకోవడానికి ముందు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, ధోనే, గుంతకల్, బళ్లారి, హోసపేట, కొప్పల్, గడగ్, హుబ్బల్లి, ధార్వాడ్, లోండా, క్యాజిల్ రాక్, కులెం, సాన్‌వోర్డెం, మడ్ గావ్‌లలో ఆగుతుంది.

బుకింగ్ షురూ.. : ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఇక ఈ ట్రైన్స్ టిక్కెట్ల బుకింగ్ అక్టోబర్ 4 నుంచి మొదలు కానుంది. అక్టోబర్ 6వ తేదీ ఉదయం 11.45 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ నుంచి మొదలై తర్వాత రోజు ఉదయం 7.20 గంటలకు చేరుతుంది. అయితే ప్రతి ఏటా 80 లక్షల మందికి పైగా గోవాను సందర్శిస్తుండగా వారిలో తెలుగువారే 20 శాతం ఉండటం విశేషం. ట్రైన్ సౌకర్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రైవేటు వాహనాలు, ఫ్లైట్లను ఆశ్రయించి గోవాకు వెళ్లేవారు. ఇప్పుడు రెండు ట్రైన్లు అందుబాటులోకి వస్తే గోవాకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరగనుంది.

టికెట్ ధరలు ఇలా.. :  సికింద్రాబాద్ నుంచి వాస్కోడి గామా కు టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్‌లో రూ. 440, థర్డ్ ఎకానమీలో రూ. 1,100, త్రీ టైర్ ఏసీలో రూ. 1,185, టూ టైర్ ఏసీలో రూ. 1,700, ఫస్ట్ ఏసీలో రూ. 2,860గా ఉన్నాయి. 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment