నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం
– దాతల సేవలు మరువలేనిది
– సహాయనిది అధ్యక్షుడు అబ్బు సతీష్
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:ఏటూరునాగారం మండ లం శంకరరాజుపల్లి గ్రామానికి చెందిన మంతెన మానస, సుమన్, వారి 3 ఏళ్ల కుమారుడు గగన్‌లు పాము కాటుకు గురై గగన్ మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గగన్ గురువారం ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మంతెన సుమన్ ముప్పనపల్లి సహాయనిధి సహాయం కోరారు. దాతల సహకారంతో, దహన సంస్కారాల కోసం ఎంజీఎం ఆసుపత్రిలో 10 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమం లో సహాయ నిధి సభ్యుడు ఎండి ఫైజుద్దీన్ పాల్గొన్నారు.