ములుగు ట్రైబల్ యూనివర్సిటీలో 13మందికి స్పాట్ అడ్మీషన్
– ఎగ్జామినేషన్ కంట్రోలర్ తుకారాం
ములుగుప్రతినిధి: ములుగు ట్రైబల్ యూనివర్సిటీలో 13 మందికి స్పాట్ అడ్మీషన్లను తీసుకున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎ.తుకారాం తెలిపారు. గురువారం నిర్వహించిన స్పాట్ అడ్మీషన్ ప్రక్రియలో బీఏ హానర్స్ ఇంగ్లీష్ లో మొత్తం 24 ఖాళీలు ఉండగా 8మంది అడ్మిషన్ పొందారని, అదే విధంగా బీఏ హానర్స్ ఎకనామిక్స్ లో మొత్తం 23సీట్లు ఖాళీ ఉండగా 5గురు విద్యా ర్థులు అడ్మిషన్లను పొందినట్లు వెల్లడించారు. మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీ వరకు గడువు ఉందని కంట్రోలర్ తుకారాం పేర్కొన్నారు. అడ్మీషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 14వ తేదిన తరగ తులు ప్రారంభించ ను న్నట్లు ఆయన వెల్లడించారు. విద్యా ర్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగంచేసుకోవాలని, పూర్తి వివరాలకు9959090799ను సంప్రదించాలని సూచించారు.