నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం
– రూ. 35వేలను అందిజేసిన ముప్పనపల్లి సహాయనిది
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : గత ఐదు రోజుల క్రితం కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామానికి చెందిన వాసంపల్లి రమేష్ కుమార్తె శివలీలకు జ్వరం రావడంతో హన్మకొండ శ్రీ చక్ర ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి కాలేయ వాపు, కామెర్లు ఉన్నట్లు తెలిపారు. హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రి అంటే కనీసం రూ. 2 లక్షలు అవుతాయని తెలిపారు. కుటుంబంలో డబ్బులు జమ చేసి నా సరిపోక పోవడంతో ముప్పనపల్లి సహాయనిది సాయం కోరి నా కూతురు ప్రాణాలను కాపాడండి అని వేడు కున్నారు. దీంతో దాతల సహకారంతో హన్మకొండలో రమేష్ కుమార్తె శివలీలను పరామర్శించి రూ. 35 వేలు ఆర్థిక సహా యం అందించారు. సహాయ నిధి సభ్యుడు ఎండి ఫైజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.