శ్రీ గర్భగౌరీ దేవి సన్నిధిలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పూజలు
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ గర్భగౌరీదేవి శరన్నవరాత్రులలో నాలుగోరోజు శ్రీబాల త్రిపురాసుందరీ దేవి గా దర్శనమివ్వగా ప్రత్యేక పూజల్లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయ పురోహితులు మాడుగుల చంద్రశేఖర శర్మ డిఎస్పీ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి, సాంప్రదాయబద్ధంగా సన్మానించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత ను డిఎస్పీ దంపతులకు వివరించారు. సంతానం ఇచ్చే తల్లి గర్భగౌరీదేవి అని,గర్భ గౌరీని పూజిస్తే సంతానం కలుగుతుందని,ఈ దేవాల యం నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించి మూడు సంవ త్సరాలుగా దుర్గాదేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నా మని, అందరి సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్న విశ్వాసం కలుగుతుందని గర్భగౌరీ ఆలయ చైర్మన్ మాడుగుల చెంద్రశేఖర శర్మ తెలిపారు.ఈ కార్యక్ర మంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మోతం వెంకటే శ్వర్లు, మెరుగు నరసింహస్వామి,మెరుగు లక్ష్మణ్, కారెంగుల బాపురావు తదితరులు పాల్గొన్నారు.