ఆత్మహత్య చేసుకున్న మొక్కజొన్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బర్ల గూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన ఇరువురు మొక్కజొన్న రైతులు, నకిలీ మొక్క జొన్న విత్తనాలు కారణంగా పంట నష్టపోయి ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా శుక్రువారం ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన కచ్చలపు చందర్రావు, లేక మధు అనే ఇరువురు మొక్కజొన్న రైతులు ఇటీవల కాలంలో నకిలి మొక్క జొన్న విత్తనాలు కారణం గా పంట నష్టపోయి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఐటిడిఏ నుండి గిరిజన పునరావాస పధకం నిధుల నుండి కచ్చలపు రాణి ,లేకం ప్రసన్న లకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు వంతున మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ పి.లక్ష్మీ రాజయ్య, ఐటిడిఏ అధికారులు, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొరసా నరసింహ మూర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.