విద్యుత్ ఘాతంతో మహిళా రైతు మృతి

విద్యుత్ ఘాతంతో మహిళా రైతు మృతి

నల్లబెల్లి, తెలంగాణ జ్యోతి : మండలంలోని గోవిందాపూర్ శివారు వేద నగరంలో శుక్రవారం విద్యుత్ ఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వేదనగరంకి చెంది న బైకానీ రాజు -కవిత (35) దంపతులు వ్యవసాయంపై ఆధారపడి కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో పంటలకు మందు పిచికారి చేసే చార్జింగ్ పంపు ఇంట్లోనే చార్జింగ్ పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే చార్జింగ్ వైరు ను కవిత తీస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, కొడుకు పదవ తరగతి బిడ్డ 8వ తరగతి చదువుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలు భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై నైనాల నగేష్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment