ప్రభుత్వ జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ కి సమ్మె నోటీసు
ములుగు, తెలంగాణ జ్యోతి : ఈనెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె నోటీసును జిల్లా వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ కి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 16న జరిగే సమ్మె కార్మికులకు సంబంధించిన అంశం, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, కనీస వేతనాల విషయంలో జరిగే ఈ సమ్మెలో, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అండ్ సానిటేషన్ వర్కర్స్, అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ హెచ్ 52 ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దకాసు వినోద్, ములుగు వైద్యశాల అధ్యక్షులు ఎనగందుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.