రెైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు ఆరబెట్టి తేవాలి

Written by telangana jyothi

Published on:

రెైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు ఆరబెట్టి తేవాలి

– పత్తి విక్రయాల్లో సాంకేతికత.

– అందుబాటులోకి వాట్సాప్ నెంబర్. 88972 81111

– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు ప్రతినిధి : రెైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు ఆరబెట్టి తేవాలనీ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం 2024 – 25 సంవత్సరానికి మార్కెట్ సీజన్ ఖరీఫ్ పత్తి మార్కెటింగ్ సీజన్ నందు సిసిఐ వారిచే ప్రతి కొనుగోలు చేయించుట గురించి జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ దివాకర్ టి .ఎస్. అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెైతులు పండించిన పత్తిని 8 శాతం తేమ మించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాల కు తీసుకు రావాలని, ఇంటివద్ద నుండి తెచ్చేటప్పుడు పత్తిని ఆరబెట్టి తేవాలని సూచించారు. ఇట్టి సమావేశం నందు రైతు సోదరులు ప్రభుత్వము ప్రకటించిన మద్దతు ధర 7521 కి వారి పత్తిని సి సి ఐ సెంటర్లలో అమ్ము కొనని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందగలరని కోరినారు. పత్తి విక్రయాల సమాచారం తెలుసుకు నేందుకు వీలుగా ఈ సీజన్లో మార్కెట్ అధి కారులు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంతో పత్తిని ఎక్కడ, ఎంత మొత్తం విక్రయించాలి, డబ్బులు ఎప్పుడు బ్యాంకులో జమ చేస్తారనే సమాచారం కోసం రైతులు ఇబ్బందులు పడే వారు.పత్తి క్రయవిక్రయాల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు రైతులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రైతు లు వాట్సాప్ నెంబరును నమోదు చేసుకొని ‘హాయి’ అని సందేశం పంపడంతో పాటు తమ ఆధార్కార్డు నమోదు చేస్తే కావాల్సిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. పత్తి రైతులు 88972 81111 నెంబరును నమోదు చేసుకోండి. సిబ్బంది తేమ శాతం నిర్ధారణ పై  క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన చేసుకొని, కోనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా వచ్చే 150 రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు సేకరణ పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విజయంతం చేయాలనీ ఆన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now